నిజామాబాద్: బోధన్ పట్టణంలో నిజాంషుగర్ ఫ్యాక్టరీ పున ప్రారంభం అవుతుందో కాదో అని ఆందోళనలో రైతులు,నిరుద్యోగులు ఉన్నారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీని తెరిపిస్తామని వాగ్దానాలు ఇవ్వడమే తప్ప నిజాయితీగా తెరిపీయడానికి ప్రయత్నం ఎవరూ చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు, ఫ్యాక్టరీ తెరుచుకుంటే బోధన్ నిరుద్యోగులకు అలాగే రైతులకు, కార్మికులకు మేలు జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇచ్చిన మాటపై నిలబడాలని ప్రజలు కోరుతున్నారు.