అస్త్రం/ బోధన్: ప్రముఖ జ్యోతిష్యుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ మనవడు డాక్టర్ యోగిరాజ్ వైద్య ని బోధన్ పట్టణ భాజపా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణ బిజెపి నాయకులు, స్థానికులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కార్యదర్శి మారోజు సుధాకర్ చారి, బోధన్ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ లు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో సమర శంఖాన్ని పూరించి బోధన్ మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని బోధన్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడానికి సహాయ శక్తులుగా కృషి చేస్తానన్నారు. నూతన కార్యవర్గ సభ్యులతో పాటు తాను సాయ శక్తులా కృషి చేస్తామని డాక్టర్ యోగిరాజ్ వైద్య తెలిపారు. తనకు ఉపాధ్యక్ష పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపటి ప్రకాష్ రెడ్డికి, వడ్డీ మోహన్ రెడ్డి, బిజెపి నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
బోధన్ బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులుగా డాక్టర్ యోగిరాజ్ వైద్య ఎన్నిక
RELATED ARTICLES