అస్త్రం/బోధన్: అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఇసుక క్వారీ నిర్వాహకులు, లారీ యజమానుల పై కఠిన చర్యలు తీసుకోవాలని బోధన్ ఎలక్ట్రానిక్ మీడియా బృందం డిమాండ్ చేశారు. సిద్దాపూర్ ఇసుక క్వారీ లో జరుగుతున్న అక్రమాల పై వార్తల ను టెలికాస్ట్ చేయడంతో కక్ష సాధింపు ధోరణితో కొంత మంది టిప్పర్ యజమానులు దౌర్జన్యం కు పాలపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిప్పర్ యజమానులు టీ న్యూస్ స్టింగర్ తార చంద్ ఫ్లెక్సీల తో ప్రదర్శన చేయడంతో పాటు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి కాళ్లతో తన్ని అవమాన పరిచిన వారి ని గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహంతి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. బోధన్ పట్టణ ఏసీపీ శ్రీనివాస్, సీ ఐ వెంకట్ నారాయణ కు పిర్యాదు చేసి సమస్య ను విన్నవించారు. గిరిజన నాయకుడు తార చంద్ ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్నాడని ఆయన దిష్టిబొమ్మను దగ్దం చేసిన వారి పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇసుక క్వారీ, టిప్పర్ యజమానుల పై చర్యలు తీసుకోవాలి
RELATED ARTICLES