అస్త్రం/బోధన్: పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో చేతుల మీదుగా ఆర్.టి.ఐ. సమాచార పరిరక్షణ కమిటీ కాలమాని ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆర్.టి.ఐ. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బుజంగ లింగం మాట్లాడుతూ హక్కుల సాధనకై పోరాడేందుకు ఏర్పాటు చేసిన సమాచార పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి గిరిధర్, ఉపాధ్యక్షులు సాయి కిరణ్ యాదవ్, జిల్లా సలహాదారులు పావులూరి సాంబశివరావు, కార్యనిర్వాహక కార్యదర్శి రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు సలీం, బోధన్ డివిజన్ అధ్యక్షులు పురం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్. టి. ఐ. కాలమాని ఆవిష్కరణ…
RELATED ARTICLES