– సామాజీక సేవకే తన జీవితం అంకితం.
– కార్పోరేట్ కు, కామన్ మ్యాన్ కు మధ్య పోటీ.
– ప్రచారంలో ముందంజలో ఉన్నా ప్రసన్న హరికృష్ణ.
– ప్రసన్న హరికృష్ణకు తమ ఓటు అంటున్నా నిరుద్యోగులు, పట్టభద్రులు.
అస్త్రం / బోధన్ : సామన్య కుంటుంబంలో జన్మించిన ప్రసన్న హరికృష్ణ సామాజీక సేవకే తన జీవితం అంకితం చేసిన వ్యక్తికి పట్టం కట్టడానికి నిరుద్యోగులు ఏకదాటిపైకి వచ్చినట్లు ప్రచారం జోరుగా కొనసాగుతుంది. కార్పోరేట్కు కామన్ మ్యాన్కు మధ్య పోటీ తీవ్రంగా ఉందని పట్టభద్రులు చర్చించుకుంటున్నారు. ఏదిఏమైన ప్రసన్న హరికృష్ణకే తమ ఓటు అంటున్నా నిరుద్యోగులు, పట్టభద్రులు, ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగుల్లో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. కొంతమంది నిరుద్యోగులు, పట్టభద్రులు స్వచ్చంధంగానే ప్రచారం నిర్వహిస్తున్నారు.నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు సంపూర్ణ మద్దతూ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది.
సామాజీక సేవకే 30శాతం జీతం
ప్రసన్న హరికృష్ణ గురించి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీనంగర్, మెదక్ జిల్లాలో తెలియని పట్టభద్రలు లేరని చెప్పవచ్చును. 2008లో జూనియర్ లెక్చరర్గా ఎంపీకై 2024 అక్టోబర్ నెల వరకు 18సంవత్సరాలుగా తన జీతంలో 30శాతం సామాజీక సేవలకే ఖర్చుచేసిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పోందారు. లక్షలాదిమంది నిరుద్యోగులకు గైడెన్స్, కౌన్సిలింగ్, క్లాసుల నిర్వహణ, విన్నర్ పబ్లికేషన్కు సలహదారులుగా ఉంటు 30వేల మందికిపైగా గ్రేడ్–1 నుంచి గ్రేడ్ ఫోర్ వరకు, ఎస్ఐ, కానిస్టేబుళ్లు, జూనియర్ లెక్చరర్లు, ఉపాద్యాయులుగా తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి ప్రసన్న హరికృష్ణకు మద్దతూ ఉందంటున్నారు.
పట్టభద్రులకు ఇచ్చిన హామీలు ఇవే
తాను ఎమ్మెల్సీగా ఎంపీకైతే వచ్చే వేతనంలో 50శాతం జీతం పేద విద్యార్థులకే ఖర్చుచేస్తానని అంటున్నారు. యూపిఎస్సీ తరహలో రాష్ట్రంలో కూడ ప్రతియేడాది జాబ్ క్యాలండర్ రీలీజ్ చేసి రెగ్యులర్గా నోటిఫికేషన్లు వచ్చేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తాను. నిరుద్యోగులకు నాలుగు జిల్లాల పరిధిలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాను. ఉన్నత చదువులు చదివినా వారి కోసం ఉచిత జాబ్ మేళలు నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తాను, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారి భాదలు నాకు తెలుసు కాబట్టి వారి సమస్యలు పరిష్కరించుటకు కృషి చేస్తాను. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థుల కోసం జిల్లా గ్రంథాలయాల్లో మౌలిక వసతులు కల్పించి ఉచిత బోజన వసతి, స్టడీ మేటిరియల్ పంపిణి చేసి, డిజిటల్ లైబర్రీల కోసం కృషి చేస్తాను. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని వంటి హామీలకు నిరుద్యోగులు, పట్టభద్రులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు కంకణబద్దులై ఓట్లు వేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పవచ్చును. ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగుస్తుండడంతో చివరి రోజున నాలుగు జిల్లాల్లో నిరుద్యోగులు, పట్టభద్రులు జోరుగా ప్రచారం నిర్వహించినట్లు చెబుతున్నారు. ఏదిఏమైన ప్రసన్న హరికృష్ణకు ఓట్లువేసి బారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.