Tuesday, March 18, 2025
Homeతాజా వార్తలుఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్‎ల వాగ్వాదంపై మంత్రి సీరియస్

ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్‎ల వాగ్వాదంపై మంత్రి సీరియస్

https://astramtelugu.com/wp-content/uploads/2025/01/IMG-20250112-WA0766.jpg

ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్‎ల వాగ్వాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా సమీక్ష సమావేశంలో కౌశిక్ రెడ్డి ప్రవర్తన హేయనియమని..కౌశిక్ రెడ్డి తీరు సరైందని కాదని మండిపడ్డారు. తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇది పార్టీలకతీతంగా జరిగిన అధికారిక సమావేశం. ఈ మీటింగ్‎కు అన్ని పార్టీల వారిని మేమే ఆహ్వానించామని తెలిపారు.అయితే, దీనిని సమావేశాన్ని డైవర్ట్ చేయడానికి జరిగిన కుట్రగా భావిస్తున్నామని లేదంటే రాజకీయ కారణాలతో ఇలాంటి చర్యలకు దిగినట్లు అనుమానం ఉందన్నారు. ఏదేమైనా జిల్లా రివ్యూ మీటింగ్‎లో ఈ రోజు జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం (జనవరి 12) జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం హాట్ హాట్ సాగింది.కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్‎లో జరిగిన ఈ సమీక్షలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నాడు. ”నువ్వు ఏ పార్టీలో గెలిచి, ఏ పార్టీలోకి వెళ్లావు. అసలు నీది ఏ పార్టీ” అంటూ కౌశిక్ రెడ్డి నిలదీశాడు. దీంతో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రుల ముందే ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిని ఒకరు తోసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమావేశం నుండి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బయటకు లాక్కెళ్లారు. కౌశిక్ రెడ్డి, సంజయ్‎ల వాగ్వాదంతో సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments