Sunday, April 6, 2025
Homeతాజా వార్తలుబోధన్​ బార్​ అసోసియేషన్​ ప్రధాన కార్యదర్శిగా రుద్రూర్​ ముద్దుబిడ్డ

బోధన్​ బార్​ అసోసియేషన్​ ప్రధాన కార్యదర్శిగా రుద్రూర్​ ముద్దుబిడ్డ

అస్త్రం / బోధన్​ : బోధన్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రధాన కార్యదర్శిగా రుద్రూర్​ ముద్దుబిడ్డ అడ్వకేట్​ సాగర్​ ఎన్నికైనారు. బార్ అసోసియేషన్​ నిర్వహించిన ఎన్నికల్లో ప్రత్యర్థి అభ్యర్థి హనుమంతరావుపై ఆరు ఓట్ల తేడాతో అడ్వికేట్​ సాగర్​ ఘన విజయం సాధించారు.అసోసియేషన్ లో మొత్తం 89 ఓట్లు పోలైనాయి. అందులో ప్రత్యర్థి అభ్యర్థి హనుమంతరావుకు 40 ఓట్లు రాగా అడ్వికేట్​ సాగర్ కు 46 ఓట్లు వచ్చాయి. మరో మూడు ఓట్లు నోటాకు వేయడం జరిగింది. పోటా పోటీగా జరిగిన ప్రధాన కార్యదర్శి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సాగర్ అడ్వకేట్​ కు పలువురు ప్రశంసలు కురిపించారు. ఈసందర్భంగా అడ్వకేట్ సాగర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించినందుకు బార్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బార్​ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని దీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments