పట్టభద్రులు నరేంద్రమోడీ వైపే ఉన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి.
అస్త్రం / ఇందూరు ప్రతినిధి :తెలంగాణాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులని గెలిపించిన నేపథ్యంలో టీచర్లు, పట్టభద్రులందరూ ప్రధాని మోడీ వైపే ఉన్నారని, వారికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై నమ్మకం లేదని ఆ పార్టీ కీలక నేత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్నారు. కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఒక చరిత్ర అని ఆయన అన్నారు.. మొన్న మల్క కొమురయ్య, ఈరోజు అంజిరెడ్డి గెలుపుతో ఉత్తర తెలంగాణలో బీజేపీ చరిత్ర సృష్టించిందని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో ఎవరికీ అవకాశం లేకుండా కౌంటింగ్ లో మొదటి నుండి ఆధిపత్యం కొనసాగిందని మొదటి, రెండవ ప్రాధాన్యత ఓట్లతో తాము గెలిచామని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంతకు బీజేపీ గెలవలేదని.. ఈ గెలుపుతో చరిత్ర తిరగరాశామని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ను విమర్శించే వారంతా.. ముందు రాష్ట్ర అభివృద్ధికి వారేం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసి.. ప్రజల దృష్టిని మరల్చడానికి కిషన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బోధన్ నియోజకవర్గం లో గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొందని, 2019లో బీజేపీకి 8వేల ఓట్లు రాగా 2024లో ఏకంగా 34 వేల ఓట్లు వచ్చాయని అన్నారు. దీనికి బూత్ స్థాయి కార్యకర్తల, బీజేపీ శ్రేణుల సహకారం.. వారి అకుంటిత దీక్ష ఎంతో ఉందని అన్నారు. ఇప్పుడుసైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు ఓ సైన్యంలా పనిచేసారని బీజేపీ అభ్యర్థి గెలుపుకోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డారనిగుర్తు చేసారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డబ్బులు పంపిణీ చేసి విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటు చేసినా పట్టభద్రులు మాత్రం బీజేపీ కే జై కొట్టారని, రెండు రోజులుగా ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగిందని అన్నారు. ఈ సందర్బంగా రాబోయే రోజులు బీజేపీ వే అని ప్రజలు చెప్పకనే చెబుతున్నారని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ లో బీజేపీ గెలుపు ఒక చెంప పెట్టు లాంటిదని చెప్పుకొచ్చారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన అంజిరెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ బీజేపీ చేస్తున్న అవిశ్రాంత పోరాటాన్ని ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు గుర్తించి ఆదరించారని,. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఈ గెలుపులు ఓ గుణపాఠం అని పేర్కొన్నారు.