ఆరోగ్యం బాగలేకనే తాను ఇండియాకు రాలేకపోయాను
–కేసులకు భయపడి రాలేదని తనకు బద్నాం చేశారు
–తన కుమారుడుపై ఫేక్ కేసలు పెట్టి ఉగ్రవాదిగా భయపెట్టించారు
–ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భయపెట్టె రాజకీయాలు మానుకోవాలని సవాల్ విసిరారు
–మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమేర్
అస్త్రం /బోధన్: తన ఆరోగ్యం భాగలేకపోవడంతోనే తాను ఇండియాకు రాలేకపోయానని, కేసులకు భయపడిరాలేదని తనకు బద్నాం చేశారని మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమేర్ హితవుపలికారు. ఆదివారం బోధన్ పట్టణంలోని అప్పాపంక్షన్ హాలులో రజతోత్సవ మహాసభ సందర్భంగా నియోజవర్గ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా షకిల్ మాట్లడుతూ తన కుమారునిపై ఫేక్ కేసులు పెట్టి 300 మంది పోలీసులతో తన ఇంటిపైకి పంపించి, ఇంట్లో కుటుంబ సభ్యులు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఉండగా ఉగ్రవాది మాదిరిగా భయభ్రంతులు సృష్టించారని ఆవేధన వ్యక్తం చేశారు. తనపై తనకుటుంబంపై కక్ష్యా సాధింపుచర్యలకు పాల్పడం న్యాయమేనానని ఆవేధన వ్యక్తం చేశారు. పదేండ్ల పరిపాలన కాలంలో తాను ఎవరికి ఇబ్బందిపెట్టలేదన్నారు. తాను పీడీయస్ రైస్ దాందా చేస్తానని బద్నాం చేశారని, తన రైస్ మిల్లులో గవర్నమెంట్‌కు ఒక రైస్ బస్తా బాకిలేనని, తనకు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి కక్ష్యపూరితమైన రాజకీయాలు చేయడం సరైందికాదన్నారు.
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భయపెట్టె రాజకీయాలు మానుకోవాలి
ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి బయపెట్టె రాజకీయాలు మానుకోవాలని, అభివృద్దిపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ పోరాటంలో తనపై, తమ నాయకులపై ఎన్నో కేసులు అయ్యాయని, తమకు కేసులు అంటే కొత్త కాదన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏకమై, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నా నీచరాజకీయాలను ఎదురించాలన్నారు. సుదర్శన్ రెడ్డి ఉమ్మడిరాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా బోధన్‌కు ఎలాంటి అభివృద్ది చేయలేదన్నారు. తాను చివరి ఆయకట్టు వరకు స్వంతడబ్బులు ఖర్చిచేసి రైతులకు సాగునీటిని అందించిన సందర్భాలు గుర్తు చేశారు. బోధన్ ప్రజలు, రైతులు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. మంత్రిపదవిపై ఉన్నా మోజు, అభివృద్దిపై లేదని విమర్శించారు. తాము అభివృద్ది చేసిన కార్యక్రమాలకు ప్రారంబోత్సవాలు చేస్తూ పోటోలకు పోజులు ఇస్తున్నారని విమర్శించారు. 18నెలల కాలంలో బోధన్‌కు ఎలాంటి అభివృద్ది చేశారో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో మున్సిపాలిటి అభివృద్దికోసం 15కోట్లు మంజూరు చేస్తే పనులు చేయలేకపోవడంలో డబ్బులు వాపోసుపోయాయని ఆవేధన వ్యక్తం చేశారు. మున్సిపాలిటి చెత్త మున్సిపాలిటిగా మారిందన్నారు. ట్రాక్టర్లు, అటోలకు కనీసం మరమ్మత్తుల పనులు చేయలేకపోవడంతో మూలన పడ్డయన్నారు. ప్రజలు తమ బాధలు చెప్పుకునేందుకు బోధన్ లో కనీసం ఆఫీసులేదన్నారు. సామన్య ప్రజలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోడిని కలువవచ్చును, కాని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలువలేకపోతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల బిఆర్ ఎస్ పాలనకు, 18 నెలల కాంగ్రెస్ పాలనను ప్రజలు చూస్తున్నారని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని అవకాశం ఇస్తే అధ్వాన్నంగా పాలిస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. తమ అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను ప్రజలు గుర్తు చేస్తున్నారని తెలిపారు. 18 నెలలలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు బేజారయ్యారని అన్నారు. సుదర్శన్ రెడ్డి వైఖరితో కాంగ్రెస్ కార్యకర్తలు సైతం అయోమయంలో ఉన్నారని విమర్శించారు.
రజతోత్సవాల సభను విజయవంతం చేయాలి..
ఈ నెల 27వ తేదీన వరంగల్ లోని ఎళ్కతుర్తి లో జరిగే రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు కోరారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పడిన నాటి నుండి తెలంగాణలో అనేక ఉద్యమాలు చేపడుతూ దేశంలోనే అగ్రగామిగా బిఆర్ఎస్ పార్టీ నిలబడిందని అన్నారు. బోధన్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, నాయకులు సకాలంలో మహాసభకు తరలి వెళ్లే విధంగా సన్నద్ధం కావాలని సూచించారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీంద్రయాదవ్, డీసీసీబీ డైరెక్టర్ గిర్ధవర్ గంగారెడ్డి, బోధన్, సాలూర, ఎడపల్లి, నవీపేట్, రెంజల్ మండలాల అధ్యక్షులు సంజీవ్‌కుమార్, నర్సయ్య, శ్రీరాం, నర్సింగ్ రావ్, భూంరెడ్డి. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.