అస్త్రం/నిజామాబాద్ : గ్రాడ్యుయేట్ బోర్డ్ ఏర్పాటుతో ఉచిత విద్య ఉచిత వైద్యం అందించేందుకు కృషి చేస్తానని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పులగం దేవిదాస్ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పులగం దేవిదాస్ మాట్లాడారు. గ్రాడ్యుయేట్ బోర్డ్ స్వయం ప్రతిపత్తి సంస్థ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.
బోర్డులో ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్ల పాలనలో ప్రత్యేక అధికారాలతో పర్యవేక్షణకు కృషి చేస్తుందని అన్నారు
రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్ లకు బోర్డు పరిధిలోకి తీసుకువచ్చి వారి సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. గ్రాడ్యుయేషన్ తరువాత మూడేళ్ల పాటు రూ॥ 10 వేల నిరుద్యోగ భృతి చెల్లించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
విదేశాల్లో ఉన్నత చదువులకు పేద విద్యార్థులకు ఫీజులు ప్రభుత్వం చెల్లించేలా కృషి చేస్తానని చెప్పారు.
పోటీ పరీక్షలు ఉద్యోగ పరీక్షలకు వెళ్లే నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు.
కార్పోరేట్ విద్యా సంస్థల్లో బిపిఎల్ విద్యార్థులకు ఉచిత విద్య అమలుకు కృషి చేస్తానని తెలిపారు.
గిరిజన ఎజెన్సీలో నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ప్రత్యేక డి.ఎస్.సి. నిర్వహణకు కృషి చేస్తానని చెప్పారు.ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఎజెన్సీ పరిధిలిలో లిగ్విస్టిక్స్, లిటరేచర్, ఆర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు..
నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న ఐఐటి లోని విద్యార్థులకు కనీస సౌకర్యాలతో పాటు విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
గ్రాడ్యుయేట్ బోర్డ్ ఏర్పాటుకు కృషి చేస్తా….
RELATED ARTICLES