నిజామాబాద్/అస్త్రం: బోధన్ వాస్తవ్యులు, ప్రముఖ జ్యోతిష్యులు డా. యోగిరాజ్ వైద్య జ్యోతిష్య శాస్త్రంలో వారు చేస్తున్న విశేష కృషికి గాను తెలుగు సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్వర్ణకంకణం అందుకున్నారు. ఆదివారం తెలుగు సంస్కృతి, సాహితీ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో వరంగల్‌లోని ప్రెస్ క్లబ్‌లో జరిగిన జాతీయ పురస్కార సన్మాన సభ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ రంగాల్లోని ప్రముఖులు హాజరయ్యారు. పురస్కారాన్ని అందుకున్న అనంతరం డా. యోగిరాజ్ వైద్య మాట్లాడుతూ, ఈ గౌరవం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. జ్యోతిష్య శాస్త్రంలో మున్ముందు మరింత కృషి చేయడానికి, మెరుగైన సేవలు అందించడానికి ఇది తనకు గొప్ప ప్రేరణ అని ఆయన పేర్కొన్నారు. డా. యోగిరాజ్ వైద్యకు స్వర్ణకంకణం లభించడం పట్ల బోధన్ వాసులు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జ్యోతిష్యశాస్త్రంలో స్వర్ణకంకణం అందుకున్న డా. యోగిరాజ్ వైద్య
RELATED ARTICLES