డా. యోగిరాజ్ వైద్యకు గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డు ప్రదానం
తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం ముగింపు ఉత్సవాలు హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కౌన్సిల్ నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో నిజామాబాదు జిల్లా బోధన్ పట్టణానికి చెందిన డా. యోగిరాజ్ వైద్య 2025 సంవత్సరానికి గాను గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డ్ ను అందుకున్నారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, కృష్ణసరస్వతి ఆస్ట్రో సెల్యూషన్ వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఆయనకు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ డా. బండ ప్రకాష్, రాష్ట్ర మంత్రి జి. వివేకానంద్, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ వ్యవస్థాపకులు డా. రాజ్ నారాయణ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు యువతను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన యువకులకు అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, యువ ప్రతినిధులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.