నిజామాబాద్: ఎడపల్లి మండలం జానకంపేట జాతరలో బోధన్ రూరల్ సీఐ తనను గాయపరిచారని బాధితురాలు ఎడపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది అయితే కంప్లైంట్ చేసిన అనంతరం రిసీవ్డ్ కాఫీ అడగగా ఎస్సై ఇవ్వడానికి నిరాకరించారని బాధితులు తెలిపారు, ఆదివారం రోజున బాధితురాలు, కుల పెద్దలతో కలిసి ఏసీపి కార్యాలయానికి వచ్చి రూరల్ సిఐ పై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు,కేసు వెనక్కి తీసుకోమని కొంతమంది నాయకులను తన దగ్గరికి పంపుతున్నారని బాధితురాలు ఆరోపించారు, వెంటనే పై అధికారులు తనపై దాడి చేసిన రూరల్ సిఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.