–ఓవర్ లోడ్ ఇసుక లారీలను పట్టించుకొని ఆర్టీఓ అధికారులు
–ప్రతి టిప్పర్ కు ఓవర్ లోడ్ కోసం ఆర్డీఓకు రూ.3వేలు చెల్లిస్తున్నాం
–బహిరంగంగా వెల్లడిస్తున్నా టిప్పర్ల ఓనర్లు
అస్త్రం / బోధన్ :బోధన్ మండలం సిద్దాపూర్ గ్రామ సమీపంలోని మంజీర నది నుంచి రెవెవ్యూ అధికారులు సోమవారం 75 టిప్లర్ల పర్మిషన్ ఇచ్చారు. 75 టిప్పర్ల ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్‌తో సిద్దాపూర్ గ్రామం మీదుగా కల్దుర్కి, రాంపూర్, బండర్‌పల్లి, శ్రీనివాస్‌నగర్ గ్రామాల మీదుగా ఓవర్‌లోడ్, ఓవర్ స్పీడ్‌తో వెళ్లుతున్నా టిప్పర్ల చూసి గ్రామస్తులు అందోళన చెందుతున్నారు. రోడ్డు ప్రక్కనే సిద్దాపూర్, కల్దుర్కి, రాంపూర్, బండర్‌పల్లి, శ్రీనివాస్ నగర్ గ్రామాలకు చెందిన పాఠశాలలు ఉన్నాయి. టిప్పర్లు సీడ్‌తో దుమ్ముదూళీ గ్రామస్తులపై పడి అందోళన చెందుతున్నారు.
పట్టించుకొని ఆర్టీఓ అధికారులు
టిప్పర్లు ప్రతిరోజు ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్‌తో వెళ్లుతుండడంతో ఆర్టీఓ అధికారులు స్థానిక గ్రామాల ప్రజలు ఫోన్ చేసిన పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఒక్క టీప్పర్ కు 13టన్నుల ఇసుక తరలించవలసి ఉండగా, 25 నుంచి 30టన్నుల ఇసుక తరలిస్తున్నారని గ్రామీణ ప్రజలు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం స్థానిక ఎంవీఐ శ్రీనివాస్ సిద్దాపూర్ గ్రామానికి వచ్చిన సమయంలో అతని ముందు నుంచే ఓవర్ లోడ్‌తో టిప్పర్లు వెళ్లుతున్నా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. టిప్పర్ల ఓనర్లు స్థానిక ఎంవీఐకు ప్రతి టిప్పర్ కు రూ.3వేల చోప్పున మాముళ్లు ఇస్తున్నామని బహిరంగంగా చెబుతున్నారు. అందుకే ఎంవీఐ స్థానిక గ్రామాల ప్రజలు ఎన్నిసార్లు పోన్లు చేసిన తాను స్థానికంగా లేనని కుంటీసాకులు చెబుతూ తప్పించుకుంటున్నారని తెలిపారు. ఓవర్ లోడ్‌తో వెళ్లె లారీలపై చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని స్థానిక గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇసుక తరలింపుపై అవగాహన లేని ఆర్ఐ
సిద్దాపూర్ గ్రామ సమీపంలోని మంజీర నది నుంచి ఇసుక తరలిస్తున్నా చోట ఆర్ఐ ఉన్నారు. ఒక్కొక టిప్పర్ కు 10క్విబీక్ మీటర్ల ఇసుక లోడ్ చేయడానికి పర్మిట్లు ఇస్తున్నారు. 10క్విబీక్ మీటర్లు అంటే 13టన్నుల వరకు టిప్పర్ లలో లోడ్ చేసి పంపించాలి. అలాగే కూలీలతోనే ఇసుకను నింపాలి. నిబంధనాలకు విరుద్దంగా టిప్పర్లలో ఇసుకను డోజర్లతో ఇసుకను నింపితున్నారు. ఒక్కొక్క టిప్పర్లలో 13టన్నులు నింపవలసి ఉండగా, 18టన్నుల నుంచి 30టన్నుల వరకు ఓవర్‌లోడ్ చేసి ఇసుక పంపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో టిప్పర్ల ఓనర్లు వారికి ఇష్టంవచ్చినంత ఇసుకను ఓవర్‌లోడ్ చేసుకొని వెళ్లుతున్నారు. ఓవర్‌లోడ్‌తో స్థానిక గ్రామాల మధ్యన ఉన్న రోడ్లు తింటున్నాయని అందోళనన చెందుతున్నారు. ఆర్టీఓ, రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని స్థానిక గ్రామాల ప్రజలు కోరుతున్నారు