బోధన్ పట్టణంలోని హైటెక్ బార్ సమీపంలోని మార్కెట్ రోడ్ గురువారం రాత్రి రౌడీ షీటర్ అబ్బు అతనితో పాటుగా మరోక వ్యక్తి తాగిన మైకంలో ఇద్దరు వీరంగం సృష్టించారు. స్వీట్ హోం ఓనర్‌తో గొడవకు దిగారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేశాడు. దీంతో స్థానికులు భయంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి రౌడిషీటర్కుఅడ్డుకునే ప్రయత్నం చేయగా ఏఆర్ కానిస్టేబుల్ ప్రశాంత్‌పై దాడిచేశారు. దీంతో పోలీసులు స్టేషన్‌కు తరలించారు. రౌటీ షీటర్ ఇటీవల జైలు నుంచి బయట వచ్చినట్లు తెలిపారు.
రౌడీ షీటర్ గతంలో స్థానిక వ్యాపారుల వద్ద మమూళ్ళు వసూళ్లు చేసేవాడు, మాముళ్లు ఇవ్వకపోతే దాడి చేయడంతో రౌడీ షీటర్‌పై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి వచ్చి మళ్ళీ వీరంగం సృష్టించడంతో స్థానికులు భయందోళన చెందుతున్నారు.