TG: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 7 ఉమ్మడి జిల్లాల్లో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు మూసి ఉండనున్నాయి. మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ కానున్నాయి.
మందు బాబులకు బ్యాడ్ న్యూస్..
RELATED ARTICLES