ఎడపల్లి : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 6గ్యారెంటీలతో పాటు ఆత్మీయభరోసా, రేషన్ కార్డు, రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు పథకాలు నిజమైన లబ్దిదారులకు అందడంలేదని కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన లబ్దిదారులకే పథకాలు అందేలా జాబితాలు తయారు చేసారని,అధికారులు క్షేత్రస్థాయిలో నిజమైన లబ్దిదారులను గుర్తించి వారికే పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎడపల్లి మండల మాజీ ఎంపీపీ శ్రీనివాస్,మాజీ ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు.
ఎడపల్లి మండల బిఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎంపీడీఓ శంకర్ ను కలిసి వినతిపత్రంను అందజేశారు.ఈ సందర్బంగా మాజీ ఎంపీపీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్, మాజీ ఉపసర్పంచ్ ఆకుల శ్రీనివాస్ లు మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలనే తపనతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఈపథకాలను ఎరవేసి గ్రామ సభలంటూ ముందుకు వచ్చిందని అన్నారు.ఈ పథకాలకు నిజమైన లబ్దిదారుల ఎంపికలో మోసం జరిగిందని అన్నారు.ఆరు గ్యారెంటీల్లో తులం బంగారం,మహిళలకు రూ. 2500 ఎక్కడా అని ప్రశ్నించారు.ఇకనైనా అధికారులు స్వచ్చందంగా క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి అసలైన లబ్దిదారులను గుర్తించి వారికే ఫలాలు అందేలా చూడాలని కోరారు.